నేడే వయనాడ్‌ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్‌..?

నేడే వయనాడ్‌ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్‌..?
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌తోపాటు ఈరోజు వయనాడ్‌ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికకు షెడ్యూల్‌ ప్రకటిస్తారా అనే సందేహాలు నెలకొన్నాయి

ఇవాళ్టి కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రెస్‌మీట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌తోపాటు ఈరోజు వయనాడ్‌ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికకు షెడ్యూల్‌ ప్రకటిస్తారా అనే సందేహాలు నెలకొన్నాయి.. ఇటీవలే రాహుల్‌పై లోక్‌సభ కార్యాలయం అనర్హత వేటు వేసింది.. లోక్‌సభ నిర్ణయంతో వయనాడ్‌ స్థానం ఖాళీ అయింది.. కొంత కాలంగా ఎమ్మెల్యేలు, ఎంపీలపై అనర్హత వేటు పడిన కొద్దిరోజుల్లోనే ఉప ఎన్నికలకు షెడ్యూల్‌ ప్రకటింంది కేంద్ర ఎన్నికల సంఘం.. దీంతో ఇవాళ ఏం జరుగుతుందనే చర్చ మొదలైంది.. అటు అనర్హత వేటుపై రాహుల్‌ గాంధీ ఇంత వరకు పైకోర్టును ఆశ్రయించలేదు.. పైకోర్టును ఆశ్రయించడంలో జాప్యంపై కాంగ్రెస్‌ వర్గాల్లో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి.

Tags

Next Story