బీజేపీలో చేరితే మరక మాయం.. వాషింగ్ మిషన్‌తో దీదీ వినూత్న నిరసన

మోదీ సర్కార్ పై మమతా బెనర్జీ ఫైర్ అయ్యారు. దేశంలో సమాఖ్య వ్యవస్ధకు బీజేపీ తూట్లు పొడుస్తుందన్నారు.బీజేపీని వ్యతిరేకరిస్తే ఈడీ, సీబీఐలను ప్రయోగిస్తున్నారని,నల్ల మరకలు బీజేపీలో చేరితే తెల్లగా మారుతాయంటూ..వాషింగ్ మిషన్‌తో వినూత్న నిరసన తెలిపారు దీదీ.బట్టలను వాషింగ్ మిషన్ వేసి బీజేపీలో చేరితే ఇలానే మరకలు మాయం అవుతాయంటూ సెటైర్లు వేశారు.బీజేపీ నేతలు ఫ్యూడల్ దొరల్లా వ్యవహరిస్తూ మన ప్రజాస్వామ్యాన్ని బీజేపీ దెబ్బతీస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారిపైకి ఈడీ, సీబీఐలను ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. తాను విదేశీ పర్యటనలకు వెళితే కిరాయి మూకలకు డాలర్లను ఎరగా వేసి తనకు నల్ల జెండాలు చూపేలా బీజేపీ వ్యవహరించిందని దీదీ విమర్శించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com