పార్లమెంటు ఉభయ సభలు వాయిదా

పార్లమెంటు ఉభయ సభలు వాయిదా

పార్లమెంటు ఉభయ సభలు ఈ రోజు మధ్యాహ్నాం రెండు గంటలకు వాయిదా పడ్డాయి. అధికార, విపక్షాలు పరస్పర డిమాండ్లతో లోక్‌సభ, రాజ్యసభలను హోరెత్తించాయి. ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వాలని విపక్షాలు పట్టుబట్టాయి. అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ చేత దర్యాప్తు చేయించాలని కాంగ్రెస్ సహా విపక్షాలు పట్టుబట్టాయి. అయితే రాహుల్‌ గాంధీ భారత్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని, ఆయన క్షమాపణ చెప్పాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు.బీజేపీ సభ్యులు అక్కడ, ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. పార్లమెంటులో చర్చించడానికి ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు ప్రతిపక్ష సభ్యులు. అధికార,ప్రతిపక్ష సభ్యుల నిరసన మధ్య పార్లమెంట్‌ ఉభయ సభలు వాయిదా పడ్డాయి.


Tags

Next Story