ఛార్టర్డ్‌ అకౌంటెంట్లను తప్పుడు కేసులతో వేధిస్తున్నారు: మురళీకృష్ణ

ఛార్టర్డ్‌ అకౌంటెంట్లను తప్పుడు కేసులతో వేధిస్తున్నారు:  మురళీకృష్ణ

ఛార్టర్డ్‌ అకౌంటెంట్లు, ఆడిట్‌ సంస్థలను దర్యాప్తు సంస్థలు తప్పుడు కేసులతో వేధిస్తున్నాయన్నారు ఐసీఏఐ ఛైర్మన్‌ మురళీకృష్ణ. క్లయింట్లకు సేవలు అందిస్తూ నిబద్ధతతో పనిచేసే వృత్తి నిపుణులను అరెస్ట్‌ చేయటం సరికాదన్నారు. హైదరాబాద్‌ రెడ్‌హిల్స్‌లో నిర్వహించిన సదస్సులో తెలుగు రాష్ట్రాల్లో ఛార్టర్డ్‌ అకౌంటెంట్ల అరెస్టులపై చర్చించారు. సీఏల హక్కులు పరిమితులపై ఫిబ్రవరి 3న అన్ని రాష్ట్రాల డీజీపీలకు లేఖలు రాశామన్నారు. అయినా వేధింపులు ఆగడం లేదన్నారు. తమవైపు నుంచి తప్పులుంటే చర్యలు తీసుకోవచ్చని, కానీ కక్షసాధింపు తగదన్నారు.

Tags

Read MoreRead Less
Next Story