అదానీపై దర్యాప్తు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీనే సరైంది: పవార్‌

అదానీపై దర్యాప్తు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీనే సరైంది: పవార్‌
అదానీ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ తో దర్యాప్తు జరిపించాలన్న విపక్షాల డిమాండ్‌తో NCP చీఫ్ శరద్ పవార్ విభేదించారు

అదానీ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ తో దర్యాప్తు జరిపించాలన్న విపక్షాల డిమాండ్‌తో NCP చీఫ్ శరద్ పవార్ విభేదించారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటే సరైనదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదానీ అంశం పార్లమెంటు రెండోవ విడత బడ్జెట్ సమావేశాల్లో అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర రభసకు దారితీసి సభాకార్యక్రమాల ప్రతిష్టంభనకు దారితీసింది. జేపీసీకి విపక్షాలు పట్టుపట్టగా, దానిని అధికార పార్టీ సభ్యులు ప్రతిఘటించారు. కాగా, అదానీ అశంపై జేపీసీ దర్యాప్తునకు తమ పార్టీ మద్దతిచ్చినమాట నిజమేనని, అయితే, జేపీసీపై అధికార పార్టీ ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంటుందన్నారు. అందువల్ల నిజం బయటకు రావాలంటే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్యానల్ ఏర్పాటే మెరుగైన మార్గంగా తాను భావిస్తున్నట్టు శరద్ పవార్ చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story