కర్నాటక పోలీసులను బురిడి కొట్టించిన సంధ్యా కన్వెంన్షన్‌ శ్రీధర్‌రావు

కర్నాటక పోలీసులను బురిడి కొట్టించిన సంధ్యా కన్వెంన్షన్‌ శ్రీధర్‌రావు
హైదరాబాద్‌లో తాను చీట్‌ చేసిన..వెలగపూడి రఘు, కోనేరు రమేష్‌పైనే సంధ్యా శ్రీధర్‌ ఫిర్యాదు చేశాడు

కర్నాటక పోలీసులను బురిడి కొట్టించాడు సంధ్యా కన్వెన్షన్‌ శ్రీధర్ రావు‌. హైదరాబాద్‌లో తాను చీట్‌ చేసిన..వెలగపూడి రఘు, కోనేరు రమేష్‌పైనే సంధ్యా శ్రీధర్‌ ఫిర్యాదు చేశాడు. తనపై ఫిర్యాదు చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకునే పనిలో పడ్డాడు సంధ్యా శ్రీధర్‌. ఆయన ఓ చీటర్‌ అని తెలియక అతని ఉచ్చులో పడ్డ కోలార్‌ పోలీసులు బాధితులపైనే కేసు నమోదు చేశారు. తన నేర చరిత్రను దాచిపెట్టి కర్నాటక పోలీసుల ముందు అమాయకత్వాన్ని ప్రదర్శించాడు. తన చీటింగ్‌ శైలిని మరోసారి బయటసెట్టాడు సంధ్యా శ్రీధర్‌. ఆయన మోసాలు తెలియక ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు పోలీసులు.

Tags

Next Story