Kolkata : జలాంతర్భాగంలో రైలు ప్రయాణం

Kolkata : జలాంతర్భాగంలో రైలు ప్రయాణం
X

భారత్ లో తొలి జలాంతర్భాగ రైలు ట్రయిల్ రన్ విజయవంతంగా సాగింది. కోల్ కతాలో ఈ చరిత్రాత్మక ఘటన ఆవిష్కృతమైంది. ప్రసిద్ధిగాంచిన హౌరా స్టేషన్ ను ఎస్పలాండేతో కలుపుతూ హూగ్లీ నది అంతర్భాగంలో ట్రాక్ నిర్మితమైంది. కోల్ కతా మెట్రో నిర్వహించిన ట్రయిల్ రన్ లో సీనియన్ ఉద్యోగులు, ఎంపికైన ఇంజినీర్లు మాత్రమే పాలుపంచుకున్నారు. కోల్ కతా మెట్రో జెనరల్ మేనేజర్ పి. ఉదయ్ కుమార్ రెడ్డి దీన్నో చరిత్రాత్మకైన ఘటనగా కొనియాడారు. త్వరలోనే రెగ్యులర్ ట్రయిల్స్ నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. భారత్ లో ఇదో విప్లవాత్మకమైన సందర్భమని చెప్పుకొచ్చారు. తొలి ట్రయిల్ రన్ లో భాగంగా మహాకరణ్ స్టేషన్ నుంచి హౌరా మైదాన్ స్టేషన్ కు ప్రయాణించినట్లు వెల్లడించారు.

Tags

Next Story