Delhi Liquor Scam : సీబీఐ సమన్లపై సీఎం కేజ్రీవాల్ అసహనం

ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ సమన్లపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ అసహనం వ్యక్తం చేశారు. అరెస్టు చేయాలని బీజేపీ వాళ్లు ఆదేశిస్తే సీబీఐ వాళ్లు చేయక ఏం చేస్తారు? అని వ్యాఖ్యానించారు. కోర్టు ముందు సీబీఐ, ఈడీ అబద్ధాలు చెపుతున్నాయని ఆరోపించారు. ఈ సంస్థల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరెస్టయిన వారిని దర్యాప్తు సంస్థలు వేధిస్తున్నాయని మండిపడ్డారు. అయితే తాను ఆదివారం సీబీఐ ఎదుట విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు. మనీష్ సిసోడియాను ఈ కేసులో ఇరికించేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. వంద కోట్లు ఇచ్చారని ఆరోపణలు చేశారు.. కానీ మనీష్ సిసోడియా వద్ద ఏమి దొరకలేదన్నారు. గోవా ఎన్నికల లో అవినీతి డబ్బు ఖర్చు పెట్టామని ఆరోపిస్తున్నారని.. ఐతే.. తాము అంతా చెక్ ద్వారానే విరాళాలు తీసుకున్నామని.. గోవా ఎన్నికల ఖర్చు వివరాలు ఈసీకి ఇచ్చామని స్పష్టం చేశారు. తాను వెయ్యి కోట్లు మోదీకి ఇచ్చానని చెబుతున్నా.. ఆయనను కూడా అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. ఢిల్లీ మద్యం పాలసీ చాలా అద్భుతమైన విధానమని.. దీని వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరిగిందని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com