బీజేపీ ప్రభుత్వంపై 14 పార్టీలు పిటిషన్‌..సుప్రీం నిరాకరణ

బీజేపీ ప్రభుత్వంపై 14 పార్టీలు పిటిషన్‌..సుప్రీం నిరాకరణ

సీబీఐ, ఈడీ సహా దర్యాప్తు సంస్థలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందంటూ 14 పార్టీలు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ జేబీ పార్ధివాలాతో కూడిన ధర్మాసనం ముందు ఈ పిటిషన్‌ ఇవాళ విచారణకు వచ్చింది.. ప్రతిపక్ష నాయకులు, పౌరులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం కఠినమైన నేర ప్రక్రియలకు పాల్పడుతోందని, కేంద్ర ప్రభుత్వంతో విభేదించే, అసమ్మతి తెలిపే వారి ప్రాథమిక హక్కులను కాలరాస్తోందని 14 పార్టీలు పిటిషన్‌లో పేర్కొన్నాయి.. అయితే, ఈ పిటిషన్‌పై విచారణకు ధర్మాసనం నిరాకరించింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.

Tags

Read MoreRead Less
Next Story