బీఆర్‌ఎస్ పార్టీ ఆఫీస్‌లో రూ.15 కోట్లు ఇచ్చా..సుఖేష్ లేఖ

మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ సంచలనం అయింది. సుఖేష్ లేఖపై ఆయన అడ్వకేట్ అనంత్ మాలిక్ స్పందించారు. వచ్చేవారం సుఖేష్ చంద్రశేఖర్ మరో సంచలన విషయం బయట పెట్టనున్నాడని వెల్లడించారు. 15 కోట్ల వ్యవహారంపై సుఖేష్ తరుపున నిన్న అడ్వకేట్ అనంత్ మాలిక్ లేఖ విడుదల చేశారు. కేజ్రీవాల్, సంత్యేంద్ర సూచన మేరకు బీఆర్‌ఎస్ కార్యాలయంలో 15 కోట్లు ఇచ్చారన్నారు. 2020లో బీఆర్‌ఎస్ ఆఫీస్‌లో రేంజ్ రోవర్‌లో ఉన్న ఏపీ అనే పేరు గల వ్యక్తికి 15 కోట్లు ఇచ్చానని పేర్కొన్నారు. ఏపీ అనే వ్యక్తి ఎవరో త్వరలోనే బయట పెడతామని స్పష్టం చేశారు.
అలాగే ఘీ అనే కోడ్‌తో చాట్ చేసినట్లు వెల్లడించారు. సుఖేష్ దెగ్గర కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్‌లకు సంబంధించి 700 పేజీల చాట్ ఉందన్నారు. గతంలో అరవింద్ కేజ్రివాల్‌తో కలిసి సుఖేష్ పనిచేశాడన్న అడ్వకేట్ ఇప్పటికీ జైలు నుంచి 12 లేఖలు రాశారని చెప్పారు. కొన్ని లేఖలపై హై పవర్ కమిటీ వేసే దర్యాప్తు చేస్తున్నామన్నారు. రాజ్యసభ సీటు ఇస్తామని ఆమ్‌ఆద్మీ పార్టీ హామీ ఇచ్చిందని, సుఖేష్ జైలకు వెళ్లాకా అతనిపై ఆప్ కక్ష సాధిస్తుందని అడ్వకేట్ పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com