టీవీ ప్రేక్షకులకు షాక్.. మళ్లీ 19 రూపాయల పరిమితి

టీవీ ప్రేక్షకులకు షాక్ తగలనుంది. కన్సూమర్ల నెలవారీ టీవీ సబ్‌స్క్రిప్షన్ బిల్లు పెరగనుంది. ప్రముఖ టీవీ బ్రాడ్‌కాస్టర్లు ఛానళ్లకు సంబంధించి అలకార్టే, బౌక్వెట్ రేట్లను పెంచేశాయి. బ్రాడ్ కాస్టర్లు ధరలు పెంచడం వల్ల ఆ ప్రభావం పే టీవీ ఇండస్ట్రీ పైన ఉండే అవకాశం ఉందని టీవీ డిస్ట్రిబ్యూట్ సర్వీస్ ప్రొవైడర్లు అంటున్నారు. ఇప్పటికే డీడీ ఫ్రీ డిష్ ప్రసార్ భారతీ ఫ్రీ డైరెక్ట్ టు హోమ్ ప్లాట్‌ఫామ్,ఓటీటీ ప్లాట్‌పామ్స్ నుంచి ఇప్పటికే ఈ విభాగం తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ట్రాయ్ మళ్లీ 19 రూపాయల పరిమితిని అమలులోకి తీసుకువచ్చింది. గతంలో 12 రూపాయలుగా ఉండేది. ఫిబ్రవరి 1 నుంచి ఈ కొత్త రూల్ అమలులోకి వచ్చింది. అలాగే బ్రాడ్‌కాస్టర్లు 45 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్ చేయొచ్చు. పే ఛానల్ బౌక్వెట్స్‌కు ఇది వర్తిస్తుంది.
మరోవైపు ఇప్పటిదాకా నెలకు 250 రూపాయల కేబుల్ బిల్లు కట్టే ఇంటికి ఇక మీదట 300పైగా కట్టాల్సిన పరిస్థితి. ధర పెంచింది బ్రాడ్ కాస్టర్లే అయినా, చెల్లించేది ప్రేక్షకులే అయినా, ఈ పెరిగిన ధరల వలన చందాదారులు వెళ్లిపోతారని, వ్యాపారం దెబ్బతింటుందని ఆపరేటర్లు భయపడుతున్నారు. చందాదారులంతా డీటీహెచ్ వైపో, ఓటీటీ వైపో మళ్లుతారని ఆందోళన చెందుతున్నారు. కేబుల్ ద్వారా పే చాన్సల్ తీసుకోవటం కంటే ఓటీటీ మెరుగ్గా ఉందనే అభిప్రాయం ఉండటం, బ్రాడ్ కాస్టర్లు కూడా కేబుల్ పట్ల పక్షపాతం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు కూడా కేబుల్ రంగాన్ని ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. కొత్త టారిఫ్ ధరలకు అంగీకరించని ఎమ్మెస్వోలకు తమ చానెళ్ల ప్రసారాలను నిలిపేస్తున్నామని డీస్నీ స్టార్, జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్, సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ తెలిపాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com