ఎయిర్ ఏషియాకు రూ.20 లక్షల జరిమానా

ఎయిర్ ఏషియాకు రూ.20 లక్షల జరిమానా
షెడ్యూల్ ప్రకారం పైలెట్ ప్రొఫిషియన్సీ చెక్, రేటింగ్ చెక్ లాంటి నియమాలను పాటించడంలేదని తెలిపింది

ఎయిర్ ఏషియాకు డీజీసీఏ (Directorate General of Civil Aviation) రూ.20 లక్షల జరిమానా విధించింది. పైలెట్ల శిక్షణలో లోపాలు ఉన్నట్లు పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం పైలెట్ ప్రొఫిషియన్సీ చెక్, రేటింగ్ చెక్ లాంటి నియమాలను పాటించడంలేదని తెలిపింది. డీజీసీఏ సివిల్ ఏవియేషన్ అవసరాల ప్రకారం ఎయిర్ లెన్స్ హెడ్ ట్రైనర్ ను మూడు నెలల పాటు విధులనుంచి తొలగించింది. ఎనిమిదిమంది ఎగ్జామినర్లకు ఒక్కొక్కరికి 3 లక్షల జరిమానా విధించింది.


సంబంధిత మేనేజర్, హెడ్ ట్రైనర్, ఎయిర్ ఏషియా యొక్క ఎగ్జామినర్లతోపాటు, నియంత్రణ బాధ్యతలను పర్యవేక్షించిన వారిపై ఎన్ ఫోర్స్ మెంట్ ఎందుకు చర్యలు తీసుకోకూడదని షోకాజ్ నోటీసులు జారీచేసింది డీజీసీఏ. వారి వ్రాతపూర్వక సమాధానాలను పరిశీలించి, దాని ఆధారంగా చర్యలు తీసుకున్నారు డీజీసీఏ అధికారులు.

Tags

Next Story