'లవ్ జీహాద్'పై నిఘాకు ప్రత్యేక కమిటీ; మహారాష్ట్ర సంచలన నిర్ణయం
మహారాష్ట్ర

మహారాష్ట్ర :
లవ్ జీహాద్ పై నిఘా పెట్టేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు మహారాష్ట్ర డిప్యుటీ ఛీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫాడ్నవిస్ ప్రకటించారు. శ్రద్ధా వాకర్ విషాదాంతం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో పది మంది సభ్యులతో కూడిన ప్యానల్ ను ఏర్పాటు చేయనున్నారు. మతాంతర వివాహాలపై ఈ ప్యానల్ ఓ కన్నేసి ఉంచుతుందని తెలుస్తోంది. ముఖ్యంగా కుటుంబానికి వ్యతిరేకంగా వివాహబంధంలోకి అడుగుపెట్టిన అమ్మాయిలు, తమ కులం నుంచి వెలివేయబడిన వారికి అండగా నిలిచేందుకు ఈ కమిటీ ఏర్పాటు చేశారు. మరోవైపు ఇప్పటికే ఈ కమిటీపై ప్రత్యర్థి పార్టీలు విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టాయి. ఇదొక వికారమైన చర్య అంటూ ప్రతిపక్షాలు ఒంటికాలిమీద చిందులు తొక్కుతున్నాయి.
అయితే ఈ ప్యానల్ మతాంతర వివాహాలకు వ్యతిరేకం కాదని స్త్రిీ, శిశు సంరక్షణా శాఖా మంత్రి ప్రభాత్ లోథా స్పష్టం చేశారు. కుటుంబ సభ్యుల నిరాదారణకు గురైన మహిళలకు భరోసా కల్పించడమే ఈ కమిటీ ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు. వీలైతే కుటంబ సభ్యులకు, మహిళలకు కౌన్సిలింగ్ ఇచ్చి వారందరిని ఒక్కతాటి పైకి తీసురావడమే తమ ధ్యేయమని తెలిపారు. గత నెలలోనే రాష్ట్రంలో తమ కుటుంబ అభీష్ఠానికి వ్యతిరేకంగా మతాంతర వివాహాలు చేసుకున్న మహిళల జాబితా సేకరించాల్సిందిగా లోధా రాష్ట్ర స్త్రీ సంక్షేమ కమిషనర్ కు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జాబితా ప్రకారం తాజాగా ఏర్పాటైన ప్యానల్ సదరు మహిళల్ని గుర్తించి వారికి తగిన రక్షణ, సహాయక ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా కుంటుంబంతో సత్సంబంధాలు కోల్పోయిన వారికి ఆసరాగా నిలుస్తూనే, తల్లిదండ్రుల తిరిగి అమ్మాయిని చేరదీసేవిధంగా వారికి కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు.
ఓ వైపు హిందూవాద పార్టీలు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తుండగా, మరోవైపు జాతీయ కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరుగుతోంది. ఇదొక చెత్త కమిటీ అని, ఎవరు ఎవరిని పెళ్లి చేసుకుంటే ప్రభుత్వానికి ఎందుకంటూ NCP మాజీ మంత్రి జితేంద్ర అవ్హాద్ దుమ్మెత్తి పోశారు. స్వాత్రంత్య మహారాష్ట్రలో ఇదోక హీనమైన, వికారమైన చర్య అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఎటుపోతోంది అనడానికి ఈ ప్యానల్ ఏర్పాటే నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల జీవితాల్లో జోక్యం చేసుకోవద్దని హితువు పలికారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com