OYO ROOMS : ఓయో వ్వవస్థాపకుడు రితేష్ అగర్వాల్ కు పితృవియోగం

OYO ROOMS : ఓయో వ్వవస్థాపకుడు రితేష్ అగర్వాల్ కు పితృవియోగం
X


ప్రముఖ ఓయో రూమ్స్ వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ తండ్రి రమేష్ అగర్వాల్ మృతిచెందారు. శుక్రవారం సాయంత్రం గురుగ్రామ్ లోని రమేష్ అగర్వాల్ నివసిస్తున్న 20వ అంతస్తు నుంచి పడి చనిపోయారు. రితేష్ కు వివాహం జరిగిన కొద్ది రోజుల్లోనే ఈ ఘటన జరిగింది. "బరువైన హృదయంతో ఉన్నాము. మానాన్న శ్రీ రమేష్ అగర్వాల్ మార్చి 10న మరణించారని తెలియజేయడం బాధాకరంగా ఉంది. ఆయన పూర్తి జీవితాన్ని గడిపారు. నాకు స్పూర్తిప్రధాత. ఆయన మరణం మా కుటుంబానికి తీరని లోటు. కష్టసమయాల్లో మా నాన్న ఆప్యాయతను పంచారు. ఈ దుఃఖ సమయంలో మా గోప్యతను గౌరవించాలని ప్రతీ ఒక్కరిని అభ్యర్థిస్తున్నాము"అని రితేష్ అగర్వాల్ తెలిపారు.

ఘటనా స్థలాన్ని పరిశీలించారు గురుగ్రామ్ ఈస్ట్ డీసీపీ. డీఎల్ఎఫ్ ది క్రెస్ట్ 20వ అంతస్థునుంచి రమేష్ అగర్వాల్ పడిపోయారని తెలిపారు. ఘటనా స్థలంలో ఎలాంటి సుసైడ్ నోట్ లభించలేదని అన్నారు. రమేష్ అగర్వాల్ మరణించిన సమయంలో అతని భార్య, కొడుకు రితేష్, కోడలు అపార్ట్ మెంట్ లోనే ఉన్నట్లు తెలిపారు. శవపరీక్ష నిర్వహించి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించినట్లు తెలిపారు.

Tags

Next Story