పశ్చిమ బెంగాల్ లో వందే భారత్ పై దాడి

పశ్చిమ బెంగాల్ లో వందే భారత్ పై దాడి

పశ్చిమ బెంగాల్ లో వందేభారత్ ఎక్స్ ప్రెస్ పై రాళ్లు విసిరారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని ముర్షిదాబాద్ జిల్లా ఫరక్కా సమీపంలో శనివారం అర్థరాత్రి జరిగింది. రాళ్ల దాడిలో వందేభారత్ రైలు కోచ్ కిటికీ అద్దాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. తూర్పు రైల్వే సియాడ్ కౌసిక్ మిత్ర మీడియాతో మాట్లాడుతూ ఇది చాలా దురదృష్టకర ఘటన, దీనిపై విచారణ జరుపుతున్నామని చెప్పారు.

జనవరి 2023లో డార్జిలింగ్ ఫన్ సీదేవా ప్రాంతానికి సమీపంలో రెండు కోచ్ లపై రాళ్లు రువ్వడంతో వందే భారత్ ఎక్స్ ప్రెస్ కిటికీ అద్దాలు దెబ్బతిన్నాయని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ తెలిపింది. మల్దా సమీపంలోని హౌరా నుంచి న్యు జల్ పైగురిని కలిపే రైలుపై రాళ్లు రువ్వడంతో కిటికీ అద్దాలు పగిలిపోయాయి. ఒకే ప్రాంతంలో ఇది రెండవ దాడి అని పోలీసులు తెలిపారు.

Tags

Next Story