హర్యానాలో బస్సు ప్రమాదం.. ఐదుగురు పరిస్థితి విషమం

హర్యానాలో బస్సు ప్రమాదం.. ఐదుగురు పరిస్థితి విషమం
X


హర్యానాలో బస్సు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 35మందికి గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. హర్యానాలోని బహదూర్ గఢ్ లో సోమవారం ఉదయం యాత్రికులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఇందులో మహిళలు చిన్నారులతో సహా 35మంది గాయపడ్డారు. ఢిల్లీ - రోహ్తక్ జాతీయ రహదారిపై రోహద్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను బహదూర్ ఘర్ జనరల్ హాస్పిటల్ కు తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఢిల్లీలోని కరవాల్ నగర్ ప్రాంతానికి చెందిన బాధితులు రాజస్థాన్‌లోని ఖతు శ్యామ్ ఆలయాన్ని సందర్శించి తిరిగి వస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.

Tags

Next Story