పాట్నా రైల్వే స్టేషన్ లో అడల్డ్ వీడియో..! బ్లాక్ లిస్ట్ లోకి ఏజెన్సీ

పాట్నా రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన టెలివిజన్ స్క్రీన్‌లపై ప్రకటనల స్థానంలో పోర్న్ క్లిప్ ప్లే అయింది. ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రయాణికులు రైల్వే పోలీసులతో పాటు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కి ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఆదివారం ఉదయం 9.30 గంటలకు బీహార్ లోని పాట్నా రైల్వే స్టేషన్ లో జరిగింది. టీవీలపై మూడు నిమిషాల క్లిప్ ప్లే కావడంతో ప్రయాణికులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. యాడ్స్ వచ్చే స్క్రీన్ పై అసభ్యకరమైన వీడియోలు రావడం ఏంటని అధికారులను ప్రశ్నించారు.
ఈ విషయంపై రైల్వే అధికారులు సీనియస్ అయ్యారు. RPF స్క్రీన్‌లపై ప్రకటనలను ప్రదర్శించే ఏజెన్సీ దత్తా కమ్యూనికేషన్ అధికారులను తక్షణమే చర్యలు తీసుకోవలసిందిగా కోరారు. ఆపై దత్తా కమ్యూనికేషన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు రైల్వే పోలీసులు. ఈ ఏజెన్సీని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడంతో పాటు జరిమానా కూడా విధించింది. రైల్వే స్టేషన్‌లోని టెలివిజన్ స్క్రీన్‌లపై ప్రకటనలు ప్రసారం చేయడానికి ఏజెన్సీకి ఇచ్చిన ఒప్పందాన్ని రైల్వే అధికారులు రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై రైల్వే శాఖ ప్రత్యేకంగా విచారణ జరుపుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com