రాహుల్ గాంధీ తలవంచరు : ప్రియాంక గాంధీ
భారతదేశంలో ప్రజాస్వామ్మాన్ని పెంపొందించిన కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీ తలవంచబోరని అన్నారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా. పార్లమెంట్ సభ్యునిగా అనర్హత వేటు పడిన రాహుల్ గాంధీని మీర్ జాఫర్ అని పిలిచి కాంగ్రెస్ కుటుంబాన్ని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ న్యాయమూర్తి, ఏ బీజేపీ నాయకుడు రాహుల్ ను అనర్హుడిగా ప్రకటించలేరని తెలిపారు. బీజేపీ నాయకులు ఎవరైనా మా కుటుంబంపై. రాహుల్, ఇందిర, సోనియా, నెహ్రూలపై విమర్శలు గుప్పిస్తూ, దూషిస్తుంటారని అన్నారు.
ఏ న్యాయమూర్తికీ రాహుల్ ను రెండేళ్లు జైలు శిక్ష విధించలేరు. వారిని అనర్హులుగా ప్రకటించలేరని అన్నారు. 2019 క్రిమినల్ పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు దోషిగా నిర్ధారించిన ఒక రోజు తర్వాత రాహుల్ గాంధీ లోక్‌సభకు అనర్హుడయ్యాడు.
అధానీ సమస్యను లేవనెత్తినందుకే రాహుల్ గాంధీని అనర్హుడిగా ప్రకటించారని ప్రియాంక గాంధీ అన్నారు. కేసులో స్టే వచ్చిన తర్వాత అకస్మత్తుగా ఎందుకు పునరుద్దరించారని ఆమె ప్రశ్నించారు. మా కుటుంబం తరతరాలుగా దేశప్రజల గొంతుకగా నిలిచింది అని అన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com