నాతో కలిసి యుద్ధం చేయండీ.. నీళ్లు, కరెంట్ వస్తుంది: సీఎం కేసీఆర్‌

నాతో కలిసి యుద్ధం చేయండీ.. నీళ్లు, కరెంట్ వస్తుంది: సీఎం కేసీఆర్‌
నాందేడ్‌ జిల్లాలో బీఆర్‌ఎస్‌ రెండవ భారీ భహిరంగ సభ

మహారాష్ట్ర, నాందేడ్‌ జిల్లాలో బీఆర్‌ఎస్‌ రెండవ భారీ భహిరంగ సమావేశం జరిగింది. ఈ సభకు సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రజలు, కార్యకర్తలు తరిలివచ్చారు. కేసీఆర్‌ సమక్షంలో పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు.. ఛత్రపతి శివాజీకి జన్మనిచ్చిన మరాఠానేలకు వందనమన్నారు. మీరు చూపిస్తున్న ప్రేమకు అభివందనమని పేర్కొన్నారు. సభ నేపథ్యంలో ఇక్కడి దారులన్నీ రైతులతో కిక్కిరిసిపోయాయి. రైతులకు 24 గంటల పాటు ఉచిత కరెంట్‌ అందించాలని, రైతుల ఉత్పత్తిని ప్రభుత్వమే కొనాలి, ఈ పని ఫడ్నవీస్‌ చేస్తే నేను మహారాష్ట్రలోకి రాను అని స్పష్టం చేశారు. నన్ను అడ్డుకోవాలంటే ఆ పని చేయండన్నారు. ఆ పని చేయనంతవరకూ నేను వస్తూనే ఉంటానన్నారు.

ఈ సభకు జనం రాకుండా అడ్డంకులు సృష్టించారని, రైతుల తుఫాన్‌ను ఎవరూ అడ్డుకోలేరని, తాను భారతదేశ బిడ్డనని కేసీఆర్‌ తెలిపారు. రైతుల హక్కుల కోసం మా పోరాటం కొనసాగిస్తామన్నారు. తెలంగాణలో దళితబంధు అమలు చేస్తున్నాము, అంబేడ్కర్‌ పుట్టిన ఈ నేలలో దళిత బంధు అమలు చేయండన్నారు. 75 ఏళ్లలో ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చాయి ఎందరో పీఎంలు, సీఎంలు అయ్యారు కానీ ప్రజల సమస్యలు అలాగే ఉంటున్నాయన్నారు. 54 ఏళ్లు కాంగ్రెస్‌, 16ఏళ్లు బీజేపీ ప్రభుత్వాలు నడిచాయి, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోంది ఏమైనా తేడా కనిపిస్తుందా అని ప్రశ్నించారు.

పార్టీలు, పార్టీల నాయకులు మేలు జరిగిందే తప్ప ప్రజలకు, రైతులకు ఏం దక్కిందని కేసీఆర్‌ వెల్లడించారు. రైతుల పరిస్థితి ఎందుకు మారలేదన్నారు. రెండు పార్టీల మధ్య ఎటువంటి తేడా లేదన్నారు. మన దెగ్గర భూమి చాలా ఉంది. వ్యవసాయయోగ్యమైన నేల మన దేశంలోనే ఎక్కువుందని ఇక్కడ వాతావరణం ఎంతో బాగుంటుందన్నారు. నీళ్లు కావల్సిన దానికంటే ఎక్కువున్నాయని, ప్రతి ఏటా 50 టీఎంసీల నీరు సముద్రంలో కలిసి పోతున్నాయన్నారు. 361టన్నుల బొగ్గు మన దగ్గరుంది దానితో కావల్సినంత విద్యుత్‌ తయారు చేసుకోవచ్చునన్నారు. నాతో కలిసి యుద్ధం చేయండీ నీళ్లు వస్తాయని కేసీఆర్‌ పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story