PAN, Aadhaar Link: పాన్, ఆధార్ లింక్ చేసే తేదీ గడువు పెంపు

X
By - Vijayanand |28 March 2023 3:22 PM IST
ఆధార్, పాన్ కార్డ్ లింక్ చేసే గడువును పెంచింది కేంద్ర ప్రభుత్వం. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) విడుదల చేసిన నివేధిక ప్రకారం.. గడువు తేదీని జూన్ 30, 2023 వరకు పొడిగించారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పన్ను ఎగవేతను అరికట్టడానికి పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడం చాలా ముఖ్యమని అధికారులు తెలిపారు. పన్ను చెల్లింపుదారు రెండు డాక్యుమెంట్‌లను లింక్ చేయడంలో విఫలమైతే పాన్ కార్డ్ పనిచేయదని స్పష్టం చేశారు. అటువంటి సందర్భాలలో ఎలాంటి లావాదేవీలు చేయలేరని అన్నారు. పన్ను చెల్లింపుదారు తన ఆధార్, పాన్ లింక్ చేయని పక్షంలో జూలై 1 నుంచి ఎదుర్కోవాల్సిన శిక్షా చర్యను కూడా CBDT పేర్కొంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com