స్పీకర్ ఓం బిర్లాపై కాంగ్రెస్ అవిశ్వాసం అప్పుడే..!
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం విపక్ష పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే సోమవారం కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తోందని పార్టీ వర్గాలు తెలిపాయి. సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే కనీసం 50 మంది ఎంపీల మద్దతు అవసరం ఉంటుంది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రతిపక్ష పార్టీల మద్దతు కోరనుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు విషయంలో స్పీకర్ కార్యాలయం తొందరపాటుగా వ్యవహరించిందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఏప్రిల్ 6న పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోపు ప్రాంతీయ పార్టీలతో కలిసి స్పీకర్‌పై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే యోచన చేస్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com