యుద్ధ విమానంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

X
By - Subba Reddy |8 April 2023 11:00 AM IST
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుఖోయ్-30 యుద్ధ విమానంలో ప్రయాణించారు. తేజ్‌పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో సుఖోయ్-30 MKI యుద్ధ విమానం ఎక్కారు. 2009లో నాటి రాష్ర్టపతి ప్రతిభా పాటిల్ కూడా యుద్ధ విమానంలో ప్రయాణించారు. మరోవైపు అస్సాం పర్యటనలో ఉన్న రాష్ట్రపతి పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నిన్న కజిరంగా జాతీయ పార్కులో జరగునున్న గజ్ ఉత్సవ్-2023 వేడుకల్లో పాల్గొన్న రాష్ట్రపతి గౌహతిలో జరిగిన మౌంట్ కాంచనగంగ సాహసయాత్ర-2023ను ప్రారంభించారు. దీంతో పాటు గౌహతిలో అస్సాం హైకోర్టును ఏర్పాటు చేసి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com