వ్యాపిస్తున్న H3N2 వైరస్ .. 10రోజులు స్కూళ్లకు సెలవులు

H3N2 వైరస్ వ్యాపిస్తుండటంతో పుదుచ్చేరిలో స్కూల్స్ మూసివేశారు. మార్చి 16నుంచి 10 రోజుల పాటు 1 నుంచి 8వ తరగతి విద్యార్ధులకు సెలవులను ప్రకటించింది పుదుచ్చేరి ప్రభుత్వం. ఇన్ఫ్లూఎంజా కేసుల సంఖ్య పెరగడంతో స్కూల్స్ ను మూసివేస్తున్నట్లు పుదుచ్చేరి విద్యాశాఖ మంత్రి నమశ్శివాయం ప్రకటించారు.
భారత్ లో H3N2 వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రజలు శ్వాసకోశ సమస్యలను ఎదుర్కొంటున్నారని అధికారులు తెలిపారు. ఇది ఇన్ఫ్లూఎంజా A వైరస్ అని చెప్పారు. గతకొన్ని రోజులుగా వైరస్ వ్యాపిస్తుందని తెలిపారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించిన డేటా ప్రకారం... జనవరి 2 నుంచి మార్చి 5 వరకు భారత్ లో 451 కేసులు నమోదైనట్లు తెలిపారు. భారత్ లో మొదటి మరణం కర్ణాటకలోని హసన్ జిల్లాలో నమోదైంది. ఇప్పటివరకు ఏడుగురు ఈవైరస్ తో మరణించారని తెలిపారు.
H3N2 యొక్క లక్షణాలు
H3N2 యొక్క ఫ్లూ లక్షణాలలో శరీర నొప్పులు, చలి, జ్వరం, అలసట, అతిసారం, వాంతులు, దగ్గు, గొంతు నొప్పి, ముక్కు కారటం, తలనొప్పి ఉన్నాయి. రోగులు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మాట్లాడేటప్పుడు వైరస్ వ్యాపిస్తుందని తెలిపారు. గర్భిణీ స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, వైద్య సమస్యలు ఉన్న వ్యక్తులు వైరస్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com