వాహనదారులకు NHAI షాక్‌.. 5 నుంచి 10 శాతం పెరగనున్న టోల్ రేట్లు

వాహనదారులకు NHAI షాక్‌.. 5 నుంచి 10 శాతం పెరగనున్న టోల్ రేట్లు
NHAIప్రకారం ఏటా ఏప్రిల్ 1 నుంచి కొత్త చార్జీలు అమలు. అవసరాలను బట్టి నిర్దిష్టటోల్ పెంచడంపై ఎప్పటికప్పుడు నిర్ణయాలు

హైవేలపై ప్రయాణించే వాహనదారులకు షాక్‌ ఇవ్వబోతోంది జాతీయ రహదారుల సంస్థ. టోల్ రేట్లు 5 నుంచి 10 శాతం పెంచేందుకు రంగం సిద్ధమైంది. ఏప్రిల్ 1 నుంచి హైవేలపై టోల్ రేట్లను పెంచే అవకాశం ఉందని హిందీ దినపత్రిక హిందూస్థాన్ ప్రచురించింది. నేషనల్‌ హైవే యాక్ట్‌ ప్రకారం ఏటా ఏప్రిల్ 1 నుంచి కొత్త టోల్‌ చార్జీ రేట్లు అమలులోకి వస్తాయి. అవసరాలను బట్టి నిర్దిష్ట టోల్ పెంచడంపై ఎప్పటికప్పుడు విధాన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. టోల్‌ ఫీజు పెంపు ప్రతిపాదనలను కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ మార్చి నెల చివరి వారంలోపు పరిశీలించి ఆమోదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే వాహనదారుల నెలవారీ పాస్‌లు సైతం 10 శాతం పెరుగున్నట్లు తెలుస్తోంది.

Tags

Next Story