మోదీ సర్కార్ పైసా వసూల్ .. UPI లావాదావీలపై అదనపు ఛార్జీలు
డిజిటల్ చెల్లింపులను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ వచ్చిన మోదీ సర్కారు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. UPI లావాదావీలపై అదనపు ఛార్జీలు వేయాలని నిర్ణయించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చేసిన సిఫారసులను యధాతథంగా అమలు చేయనుంది. ఏప్రిల్ 1నుంచి ఇది అమల్లోకి రానుంది. చిన్న, పెద్ద మర్చంట్ లావాదేవీలకు కూడా ఇది వర్తిస్తాయి. UPI ద్వారా 2,000 రూపాయల కంటే ఎక్కువ లావాదేవీలు చేసిన వినియోగదారులపై 1.1 శాతం అదనపు ఛార్జీలను వసూలు చేయనున్నారు. యూపీఏ ద్వారా నెలకు 13 లక్షల కోట్ల లావాదేవీలు నమోదవుతున్నాయి. తాజా ఛార్జీలతో వినియోగదారులపై 14,300 కోట్ల భారం పడనుంది. బ్యాంక్ ఖాతా, పీపీఐ వాలెట్ మధ్య P2P, P2PM లావాదేవీలపరంగా ఎలాంటి ఛార్జీలు ఉండవు.
UPI ద్వారా ఆర్థిక, వ్యాపార లావాదేవీలపై అదనపు ఛార్జీలను వసూలు చేయాలంటూ NCPI కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ మేరకు ఓ సర్కులర్‌ను జారీ చేసింది. దేశవ్యాప్తంగా యూపీఐ ద్వారా వినియోగదారులు జరిపే బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ ఆర్థిక లావాదేవీలు, నగదు బదిలీలు, నగదు చెల్లింపులన్నింటిపైనా అదనపు ఛార్జీలను వసూలు చేయాలని సూచించింది. యూపీఐ వినియోగదారుల నుంచి అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని కేంద్రం ఇతర రంగాల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తుంది.
ఈ అదనపు ఛార్జీల వసూలుపై సెప్టెంబర్ 30వ తేదీన ఎన్సీపీఐ సమీక్ష నిర్వహిస్తుంది. దీన్ని మున్ముందు అమలు చేయాలా? వద్దా? లేక అదనపు ఛార్జీలను మరింత పెంచాలా? లేక తగ్గించాలా?, అదనపు ఛార్జీల పరిధి మొత్తం.. వంటి అంశాలను సమీక్షిస్తుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com