Akhilesh Yadav : అధికారంలోకి వస్తే నెలకి కిలో నెయ్యి ఫ్రీ : అఖిలేష్ యాదవ్

Akhilesh Yadav : ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో సైకిల్ స్పీడ్ పెంచుతోంది. బీజేపీనే లక్ష్యంగా ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ విమర్శలతో విరుచుకుపడుతున్నారు. రాయబరేలిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన ప్రజలకు హామీల వర్షం కురిపించారు. తాము అధికారంలోకి రాగానే ఐదేళ్ల పాటు నెలనెలా ఉచితంగా రేషన్, కిలో నెయ్యి ఇస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం సొంత ఉచిత రేషన్ స్కీమ్‌కు ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధం చేసిందని అఖిలేష్ ఆరోపించారు. ఇక యూపీలో 11 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఆ పోస్టులను అధికారంలోకి రాగానే భర్తీ చేస్తామని అఖిలేష్ చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో 403 మంది సభ్యులున్న శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి, రెండో దశ ఎన్నికలు ఫిబ్రవరి 10, 14 తేదీల్లో జరగగా, మిగిలిన ఐదు దశల ఎన్నికలను ఫిబ్రవరి 20, 23, 27, మార్చి 3, 7 తేదీల్లో నిర్వహించనున్నారు. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com