Jharkhand : ఓటు వేసిన 30 నిమిషాలకు 105 ఏళ్ల వృద్ధుడు మృతి..!

Jharkhand : జార్ఖండ్‌లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలలో ఓటు వేయాలన్న కోరిక నెరవేరిక దాదాపు 30 నిమిషాల తర్వాత 105 ఏళ్ల వృద్ధుడు మరణించాడు. మృతుడు జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లా చౌపరన్ బ్లాక్‌లోని పార్తాపూర్ గ్రామానికి చెందిన వరణ్ సాహు (105)గా గుర్తించారు. అతను జూన్ 27, 1917 న జన్మించాడు.
ఆరోగ్యం బాలేకపోయిన తన ఓటును వినియోగించుకోవాలని శనివారం ఉదయం తన చివరి కోరికను కుటుంబ సభ్యులకు తెలిపాడు. అప్పటికే అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అతని కుటుంబ సభ్యులు విముఖత చూపారు. కానీ ఓటు వేయాలని, అదే చివరి కోరికను పదేపదే కోరడంతో ఓ కారును అద్దెకు తీసుకొని 2 కిమీ దూరంలో ఉన్న పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్ళారు.
ఓటు వేసిన అరగంట తర్వాత వృద్దుడు తన స్వగృహంలో ప్రశాంతంగా తుదిశ్వాస విడిచాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com