Madhya Pradesh: రూ.11 కోట్ల ఆస్తిని విరాళంగా ఇచ్చి.. భార్య, కొడుకుతో కలిసి ఆధ్యాత్మిక మార్గంలోకి..
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌కు చెందిన వ్యాపారవేత్త రాకేష్ సురానా రూ.11 కోట్ల విలువైన ఆస్తులను విరాళంగా ఇచ్చారు.

మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌కు చెందిన వ్యాపారవేత్త రాకేష్ సురానా రూ.11 కోట్ల విలువైన ఆస్తులను విరాళంగా ఇచ్చారు. అతడు తన ఆస్తిని గోశాలకు, మత సంస్థలకు విరాళంగా ఇచ్చాడు. గురు మహీందర్ సాగర్ ప్రభావంతో తాను తన కుటుంబంతో సహా ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలనుకున్నట్లు తెలిపాడు.
రాకేష్ సురానా మాట్లాడుతూ.. నా భార్య లీనా సురానా చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లాలనే కోరికను వ్యక్తం చేసేది. 11 ఏళ్ల కుమారుడు కూడా అదే బాటలో పయనించాలనుకున్నారు భార్యాభర్తలిరువు. కానీ అతడిది చిన్న వయస్సు కారణంగా అతను ఏడేళ్లు వేచి ఉండవలసి వచ్చింది.
సురానా తల్లి, సోదరి కూడా ఆధ్యాత్మిక మార్గంలోనే ఉన్నారు. సురానా పెద్ద వ్యాపార వేత్త. బంగారం, వెండి వ్యాపారం చేస్తూ మార్కెట్‌లో మంచి పేరు తెచ్చుకున్నాడు.
ఇంట్లో సంపన్న జీవితాన్ని గడపడానికి అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ అవేవీ అతన్ని సంతృప్తి పరచలేకపోయాయి. చివరకు తాను సంపాదించిన కోట్ల రూపాయల ధనాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
రాకేష్ సురానా మాట్లాడుతూ.. తన భార్య లీనా సురానా (36) చిన్నతనంలోనే సిరి, సంపదలను త్యజించి భక్తి మార్గాన్ని అనుసరించాలనే కోరికను వ్యక్తం చేసింది. లీనా ప్రాధమిక విద్యని యునైటెడ్ స్టేట్స్‌లో పూర్తి చేసింది. సురానాను వివాహం చేసుకున్న తరువాత బెంగుళూరు విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. వారి కుమారుడు అమె సురానా (11) కూడా నాలుగేళ్ల వయసులోనే భక్తి మార్గంలో పయనించాలని నిర్ణయించుకున్నాడు. కానీ అతడి చిన్న వయస్సు కారణంగా, ఆమె ఏడేళ్లు వేచి ఉండాల్సి వచ్చింది
రాకేష్ సురానా బాలాఘాట్‌లో చిన్న బంగారం దుకాణం ప్రారంభించి అంచలంచెలుగా ఎదిగాడు.. బులియన్ రంగంలో ఖ్యాతితో పాటు పలుకుబడి కూడా సంపాదించాడు.
జైపూర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ముగ్గురు సభ్యులు కూడా దీక్ష చేపట్టనున్నారు. జైన సమాజం సురానా కుటుంబం నిర్ణయాన్ని స్వాగతించింది సకల్ జైన సమాజ్ ఆధ్వర్యంలో మంగళవారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీక్ష చేపట్టడానికి ముందు, రాకేష్ సురానా తన భార్య లీనా సురానా మరియు 11 ఏళ్ల కుమారుడు అమయ్ సురానాకు ఆడంబరంగా వీడ్కోలు పలికారు.
RELATED STORIES
Common Wealth Games : కామన్వెల్త్లో వరుస మెడల్స్‌తో దూసుకుపోతున్న...
8 Aug 2022 1:24 PM GMTVenkaiah Naidu : ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు చివరి ప్రసంగం ఇదే..
8 Aug 2022 12:45 PM GMTLakshya Sen : కామన్వెల్త్ క్రీడల్లో కొనసాగుతున్న భారత్ హవా..
8 Aug 2022 12:16 PM GMTPV Sindhu : కామన్వెల్త్లో 'సింధు' స్వర్ణం..
8 Aug 2022 9:56 AM GMTChandrababu: మోదీతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. దేశవ్యాప్తంగా సర్వత్రా...
7 Aug 2022 3:30 PM GMTMaharashtra: తొమ్మిదేళ్ల క్రితం కిడ్నాప్ అయిన చిన్నారి.. సురక్షితంగా...
7 Aug 2022 3:15 PM GMT