J&K's Poonch: లోయలో పడిన బస్సు.. 11 మంది మృతి

J&Ks Poonch: లోయలో పడిన బస్సు.. 11 మంది మృతి
J&K's Poonch: జమ్ము కశ్మీర్‌ పూంచ్‌ జిల్లా సాజియాన్ ఏరియాలో ఘోర ప్రమాదం జరిగింది. మినీ బస్సు ప్రమాదానికి గురైంది.

J&K's Poonch: జమ్ము కశ్మీర్‌ పూంచ్‌ జిల్లా సాజియాన్ ఏరియాలో ఘోర ప్రమాదం జరిగింది. మినీ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని మండి హాస్పిటల్‌కు తరలించారు. మండి నుంచి సాజియాన్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్‌లో స్థానికులతో పాటు ఆర్మీ సిబ్బంది పాల్గొంటున్నారు.

మృతుల కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలుపుతూ రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. "పూంచ్‌లో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. నా ఆలోచనలు వారి ఆత్మీయులను కోల్పోయిన వారందరితో ఉన్నాయి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. మరణించిన ప్రతి ఒక్కరికి పిఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుండి రూ. 2 లక్షలు ఇవ్వబడుతుంది మరియు క్షతగాత్రులకు రూ.50,000 అందజేస్తాం'' అని ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది.

జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా ఓ ట్వీట్‌లో ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. "పూంచ్‌లోని సావ్జియాన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మృతుల కుటుంబాలకు సంతాపం. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరణించిన వారి బంధువులకు రూ. 5 లక్షలు అందజేస్తామని తెలిపారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. "పూంచ్‌లోని సావ్జియాన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం చాలా బాధ కలిగించింది. నా ఆలోచనలు మరియు ప్రార్థనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను" అని రాష్ట్రపతి కార్యాలయం నుండి ట్వీట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story