12మంది తెలుగు వారికి పద్మ పురస్కారాలు

12మంది తెలుగు వారికి పద్మ పురస్కారాలు
గణతంత్ర దినోత్సవ వేళ మెరిసిన తెలుగు పద్మాలు

దేశంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘణంగా జరుగుతున్నాయి. గణతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని పద్మ పురస్కారాలను కేంద్రం అందిస్తుంది. గణతంత్ర దినోత్సవ వేళ తెలుగు పద్మాలు మెరిశాయి. పలు రంగాల్లో విశేష కృషి చేసిన వారిని అత్యున్నత పౌర పురస్కారాలతో ఏటా కేంద్ర ప్రభుత్వం సత్కరిస్తుంది.తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 12మందిని పద్మ పురస్కారాలు వరించాయి.

తెలంగాణ నుంచి ఆధ్యాత్మిక విభాగంలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చినజీయర్‌ స్వామి, కమలేశ్‌ డి పటేల్‌ పద్మ భూషణ్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణికి ఏపీ కోటాలో పద్మ శ్రీ వరించింది. తెలంగాణ కోటాలో బి.రామకృష్ణా రెడ్డి, ఎం. విజయగుప్తా, పసుపులేటి హనుమంతరావులను పద్మ శ్రీ పురస్కారం వరించింది. ఇక ఏపీ కోటాలో సంకురాత్రి చంద్రశేఖర్‌, కోట సచ్చిదానంద శాస్త్రి, అబ్బారెడ్డి నాగేశ్వర రావు, ప్రకాష్‌ చంద్రసూద్‌, సి.వి.రాజు, గణేష్‌ నాగప్ప కృష్ణరాజనగరకు పద్మశ్రీ దక్కింది.

Tags

Read MoreRead Less
Next Story