పుల్వామాలో భద్రతా దళాలపై దాడులు.. 12మంది సాధారణ పౌరులకు గాయాలు

X
By - Nagesh Swarna |19 Nov 2020 7:18 AM IST
జమ్మూకాశ్మీర్‌లోని సరిహద్దుప్రాంతంలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పుల్వామాలో భద్రతాసిబ్బందిపై గ్రెనేట్ లతో దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో 12మంది సామాన్యులు గాయపడ్డారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదుకోసం సైన్యం పెద్దయెత్తున గాలింపు చేపట్టింది.
దేశ సరిహద్దులోని పుల్వామా జిల్లా కాకాపొర ప్రాంతంలో భద్రతా దళాలపైకి ఉగ్రవాదులు గ్రెనేట్ విసిరారు. ఆ గ్రెనేడ్ గురితప్పి రోడ్డుపై పేలిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ దాడిలో 12మంది సాధారణ పౌరులు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వెంటనే అక్కడికి చేరుకున్న భద్రతా దళాలు.. సంఘటనా స్థలాన్ని స్వాధీనం చేసుకున్నాయి. దాడికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com