నా తల్లిని క్షమించండి.. రాష్ట్రపతి ముందుకు షబ్నమ్ క్షమాభిక్ష పిటిషన్..!
ప్రియుడితో కలిసి తన కుటుంబ సభ్యులను హతమార్చిన ఉత్తరప్రదేశ్ మహిళ షబ్నమ్ ఉరికి రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆమె కుమారుడు తన తల్లి నేరాలను క్షమించాలని కోరుతూ.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఎదుట క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసులో ఇప్పటికే గవర్నర్ ఆనందీబెన్ క్షమాభిక్షను తిరస్కరించారు.
అయితే మరోసారి గవర్నర్ ముందుకు ఈ పిటిషన్ వచ్చింది. మళ్లీ తిరస్కరణకు గురైతే ఆమెను ఉరితీయడానికి మథుర జైలు అధికారులు సిద్ధంగా ఉన్నారు. నిర్భయ కేసులో నిందితులను ఉరి వేసిన పవన్ జల్లాదే షబ్నమ్‌నూ ఉరి తీసే అవకాశం ఉంది. కాగా 2008లో తన ప్రియుడితో కలిసి చిన్న పిల్లలనే కనికరం లేకుండా షబ్నమ్.. ఆమె కుటుంబంలోని ఏడుగురిని గొడ్డలితో నరికి చంపేసింది.
ఈ కేసులో ఆమెకి, ఆమె ప్రియుడికి కోర్టు ఉరి శిక్ష విధించింది. అయితే అప్పటికే షబ్నమ్ గర్భవతిగా ఉంది.. ఆ తరువాత షబ్నమ్ జైలులోనే బాబుకు జన్మనిచ్చింది. అయితే జైలు రూల్స్ ప్రకారం.. జైల్లో జన్మించిన పిల్లలు ఆరు సంవత్సరాలు దాటి జైలులో ఉంచకూడదు. దీనితో ఆ బాబును షబ్నమ్ .. తన మిత్రుడైన ఉస్మాన్ సైఫీని సంరక్షకునిగా బాధ్యతలు అప్పగించింది. ఇప్పుడు ఆ బాబే తన తల్లి చేసిన నేరాలను క్షమించాలని కోరుతూ.. రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశాడు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com