Bipin Rawat: బిపిన్ రావత్‌తో సహా ఢిల్లీకి చేరిన 12 మంది ఆఫీసర్ల పార్థివ దేహాలు..

Bipin Rawat (tv5news.in)
Bipin Rawat: CDS జనరల్ బిపిన్ రావత్ సహా సైనిక అమర వీరుల పార్థివ దేహాలు ఢిల్లీ చేరుకున్నాయి. రావత్ సహా 13పార్థివ దేహాలు పాలెం ఎయిర్ బేస్ కు చేరుకున్నాయి. సూలూర్ ఎయిర్ బేస్ నుంచి స్పెషల్ ఎయిర్ క్రాఫ్టులో పార్థివ దేహాలను ఢిల్లీకి తీసుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ.. కాసేపట్లో పాలెం ఎయిర్ బేసుకు చేరుకోనున్నారు. తర్వాత సైనిక అమర వీరులకు నివాళి అర్పిస్తారు. రేపు ఢిల్లీ కంటోన్మెంట్ లో రావత్ దంపతుల అంత్యక్రియలు జరగనున్నాయి.
ప్రమాదంలో చాలామంది సైనికుల మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితికి చేరాయి. దీంతో ఇప్పటివరకు పార్థివ దేహాలను కుటుంబసభ్యులకు అప్పగించలేదు. సైనిక కుటుంబాల రక్త నమూనాల సేకరణ కొనసాగుతోంది. DNA పరీక్షలు పూర్తయ్యాకే పార్థివ దేహాలను వారి కుటుంబాలకు అప్పగించనున్నారు. ఊహించని ఈ ఘోర ప్రమాదంపై యావత్ దేశమంతా ఇంకా దిగ్భ్రాంతిలోనే ఉంది. బాధిత కుటుంబాల బాధైతే వర్ణనాతీతం
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com