జ్వరం, విరోచనాలతో 130 మంది చిన్నారులు ఆస్పత్రిపాలు..

జ్వరం, విరోచనాలతో 130 మంది చిన్నారులు ఆస్పత్రిపాలు..
COVID-19 మహమ్మారి థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావాన్ని చూపిస్తుందన్న నిపుణుల హెచ్చరికల మధ్య ఉత్తర బెంగాల్‌లోని

COVID-19 మహమ్మారి థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావాన్ని చూపిస్తుందన్న నిపుణుల హెచ్చరికల మధ్య ఉత్తర బెంగాల్‌లోని జల్పాయిగురికి చెందిన 130 మంది చిన్నారులు ఆస్పత్రిలో చేరారు.

తీవ్రమైన జ్వరం, విరోచనాలతో కనీసం 130 మంది పిల్లలు జల్పాయిగురి సదర్ ఆసుపత్రిలో చేరినట్లు ఆరోగ్య శాఖ అధికారి ఒకరు సోమవారం తెలిపారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా మారడంతో ఉత్తర బెంగాల్ మెడికల్ కళాశాలకు తరలించినట్లు ఆయన తెలిపారు. COVID-19 మహమ్మారి మూడవ వేవ్ పిల్లలకు ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తుందని నిపుణుల హెచ్చరికల మధ్య చిన్నారులు అస్వస్థతకు గురికావడం ఆందోళన కలిగిస్తుంది.

పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాము. ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నాము. తద్వారా అందరికీ అత్యవసర చికిత్స అందుబాటులో ఉంటుంది. పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది అని అధికారి మీడియాకి వివరించారు. అవసరమైతే, పిల్లలకు కోవిడ్ టెస్ట్ చేయిస్తామని ఆయన పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story