బీహార్‌లో పిడుగుపడి 15మంది మృతి

బీహార్‌లో పిడుగుపడి 15మంది మృతి
బీహార్‌ను కరోనాకు తోడు వరదలు, భారీ వర్షాలు వెంటాడుతున్నాయి. ఈ ఏడాది పిడుగుపడి బీహార్‌లో వందల మంది మృతి చెందారు

బీహార్‌ను కరోనాకు తోడు వరదలు, భారీ వర్షాలు వెంటాడుతున్నాయి. ఈ ఏడాది పిడుగుపడి బీహార్‌లో వందల మంది మృతి చెందారు. తాజాగా పిడుగుపడి 15 మంది మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం 6 జిల్లాల్లో పిడుగులు పడి 15 మంది చనిపోయారని ప్రభుత్వం తెలిపింది. మృత కుటుంబాలకు సీఎం నితీష్ కుమార్ ప్రగాడ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 4 లక్షల చెప్పున ఎక్స్‌‌గ్రేషియో ప్రకటించారు. ఈ ఏడాది కరోనాకు తోడు వర్షాలు చేస్తున్న బీభత్సానికి అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని పలు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.

Tags

Next Story