జాతీయం

Madhya Pradesh: వానరం మరణించింది.. ఊరంతా కదిలింది..

Madhya Pradesh: మధ్య ప్రదేశ్‌లోని ఓ గ్రామంలో వానరం ప్రాణాలు కోల్పోతే ఊరంతా వచ్చి అంత్యక్రియలు చేశారు.

Madhya Pradesh: వానరం మరణించింది.. ఊరంతా కదిలింది..
X

Madhya Pradesh: చావు, పుట్టుక అనేది అన్ని ప్రాణుల్లో సహజం. మనిషి మరణిస్తే ఆనవాయితీగా జరిపే కొన్ని కార్యక్రమాలు.. స్వతంత్ర భారతదేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ అంటాడు ఆకలి రాజ్యం సినిమాలో కమల్ హాసన్ మరణం గురించి చెబుతూ.. కానీ ఓ జంతువు ప్రాణం కోల్పోతే ఎవరూ పట్టించుకోని పరిస్థితి. అయితే దీనికి విరుద్ధంగా మధ్య ప్రదేశ్‌లోని ఓ గ్రామంలో వానరం ప్రాణాలు కోల్పోతే ఊరంతా వచ్చి అంత్యక్రియలు చేశారు.

వారికి వానరంతో ఉన్న అనుబంధమే కారణం.. పిల్లలు, పెద్దలు దాన్ని శ్రద్ధగా చూసుకునేవారు.. అది చేసే కోతి చేష్టలు వారికెంతో ఆనందాన్ని ఇచ్చేవి.. తమలో ఒకటిగా కలిసిపోయింది వానరం.. అది మరణించేసరికి అందరి కళ్లలో కన్నీళ్లు.. తమని నవ్వించే నాధుడు లేడని బాధపడ్డారు.. వానరం అంత్యక్రియలకు కోసం అందరూ కలిసి చందా వేసుకుని మరీ నిర్వహించారు.

రాజ్‌ఘర్ జిల్లాలోని దలూపుర్ గ్రామంలో వానరం చనిపోయింది. అది ఎవరి పెంపుడు జంతువు కాకపోయినా ఊర్లోని ప్రజలందరు కలిసి డబ్బులు సమకూర్చి వానర అంత్యక్రియల తంతుపూర్తిచేసారు. హరి సింగ్ అనే వ్యక్తి గుండు కూడా కొట్టించుకున్నాడు. పత్రిక పంచి ఊరివారందరినీ భోజనానికి ఆహ్వానించారు. పెద్ద పెద్ద టెంట్లు వేసి వందలాది మందికి భోజనాలు పెట్టారు. కోవిడ్ నిబంధనలు పక్కన పెట్టి వానరానికి నివాళులు అర్పించారు. మానవత్వం ఉన్న మనుషులుగా మిగిలిపోయారు.. అయితే కోవిద్ ప్రోటోకాల్ పాటించలేదనే నెపంతో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసారు.

Next Story

RELATED STORIES