చైనాలో భవనం కుప్పకూలిన ఘటనలో 17కి చేరిన మృతుల సంఖ్య

చైనాలో భవనం కుప్పకూలిన ఘటనలో 17కి చేరిన మృతుల సంఖ్య
చైనాలో శనివారం రెండంతస్తుల హోటల్ భవనం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతుంది.

చైనాలో శనివారం రెండంతస్తుల హోటల్ భవనం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటివరకూ 17 మంది మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్ లిన్పెన్ పట్టణంలో శనివారం ఉదయం10 గంటలకు రెండంతస్తుల భవనం కుప్పకూలింది. అయితే, ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనాస్థలంలోని సహాయాక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ శిథిలాల కింద చిక్కుకున్న 45 మందిని రక్షించారు. 21 మందికి తీవ్రగాయాలైయ్యాయని.. పలువురు పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు.

Tags

Next Story