ఈ డ్రెస్‌తోనా పరీక్ష రాయడానికి వచ్చేది: ఎగ్జామినర్ అబ్జెక్షన్.. దాంతో ఆ అమ్మాయి..

ఈ డ్రెస్‌తోనా పరీక్ష రాయడానికి వచ్చేది: ఎగ్జామినర్ అబ్జెక్షన్.. దాంతో ఆ అమ్మాయి..
పరీక్ష ప్రదేశానికి చేరుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది ఎదురవలేదు. కానీ పరీక్ష హాల్లో ఇబ్బంది మొదలైంది. ఎగ్జామినర్ హాల్లోకి అనుమతించలేదు.

అస్సాంలోని తేజ్‌పూర్ పట్టణంలో నివసించే ఓ యువతి ప్రవేశ పరీక్ష రాసేందుకు వెళ్లింది. అక్కడ ఆమెని పరీక్ష రాసేందుకు ఎగ్జామినర్ అనుమతించలేదు. కారణం ఆమె ధరించిన దుస్తులు. దీంతో ఆమె సహ విద్యార్థుల సలహాతో అక్కడే ఉన్న ఓ కర్టెన్ కాళ్లకు చుట్టుకుని పరీక్షరాయాల్సి వచ్చింది. పరీక్ష అనంతరం ఎగ్జామినర్ తీరుపై మండిపడింది. షార్ట్ ఫిలింస్‌లో నటిస్తున్న 19 ఏళ్ల జూబ్లీ అనే విద్యార్థిని అస్సాంలోని గిరిజానంద చౌదరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ (జీపిఐస్) భవనంలో అస్సాం అగ్రికల్చరల్ యూనివర్శిటీ ప్రవేశ పరీక్ష (ఏఏయూ) రాసేందుకు వచ్చింది. ఆమె తన స్వగ్రామం బిశ్వనాథ్ చరియాలి నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న తేజ్‌పూర్‌కు తండ్రిని తీసుకుని ఉదయం పరీక్ష సమయానికి వెళ్లింది.

పరీక్ష ప్రదేశానికి చేరుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది ఎదురవలేదు. కానీ పరీక్ష హాల్లో ఇబ్బంది మొదలైంది. ఎగ్జామినర్ హాల్లోకి అనుమతించలేదు. అడ్మిషన్ కార్డులో దుస్తుల కోడ్ సూచనలు లేవని ఆమె చెప్పినా వినిపించుకోలేదు. కొద్ది రోజుల క్రితం, నేను ఇదే పట్టణంలో నీట్ పరీక్షకు హాజరయ్యాను. ఈ రమైన దుస్తులే ధరించి వెళ్లాను. అప్పుడేమీ అనలేదు. ఈ రోజు మాత్రం ఇలా మాట్లాడుతున్నారు

'బయట వేచి ఉన్న నా తండ్రి వద్దకు నేను ఏడుస్తూ వెళ్లాను. చివరగా, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్‌తో మాట్లాడితే ప్యాంటు ఏర్పాటు చేయగలిగితే నేను పరీక్ష రాయవచ్చని చెప్పారు. దాంతో నాన్న ప్యాంటు కొనడానికి మార్కెట్‌కు పరుగెత్తారు. కానీ పరీక్ష సమయం దగ్గర పడుతున్నందున ఆమె వేచి ఉండలేకపోయింది. తండ్రి బాబుల్ తములి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్కెట్‌కి వెళ్లి వచ్చే సరికి సమయం మించి పోతుంది. దీంతో తోటి విద్యార్ధుల సలహాతో కాళ్లకు కర్టెన్ చుట్టుకుని పరీక్ష రాసింది.

'నాకు మినిమమ్ మేనర్స్ (ప్రాథమిక ఇంగితజ్ఞానం) లేకపోతే నేను జీవితంలో ఎదగలేనని వారు పేర్కొన్నారు,' ఇది అన్యాయమని జూబ్లీ అన్నారు. 'వారు కోవిడ్ ప్రోటోకాల్‌లు, మాస్క్‌లు లేదా ఉష్ణోగ్రతను కూడా తనిఖీ చేయలేదు, కానీ షార్ట్‌ వేసుకుని వచ్చానని ప్రశ్నించారు' అని ఆమె మీడియా ముందు వాపోయింది.

అయితే ఈ విషయంపై కాలేజీ ప్రిన్సిపల్ అబ్దుల్ అహ్మద్ మాట్లాడుతూ.. మా కాలేజీలో ఎగ్జామ్ నిర్వహణ కోసం అనుమతి తీసుకున్నారు.. ఇక్కడ షార్ట్స్ వేసుకోకూడదనే నియమ నిబంధనలు ఏమీ లేవు. కాకపోతే పరీక్ష వేళ పద్దతిగా వ్యవహరించాల్సిన విషయాన్ని పిల్లలతో సహా పెద్దలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story