ఆడి కొత్త మోడల్ ఆర్ఎస్ క్యూ8.. ఫీచర్లు, ధర..

ఆడి కొత్త మోడల్ ఆర్ఎస్ క్యూ8.. ఫీచర్లు, ధర..
లగ్జరీ కారుగా పేరుగాంచిన ఆడి భారత్ లో సరికొత్త ఎస్‌యూవీని విడుదల చేసింది

లగ్జరీ కారుగా పేరుగాంచిన ఆడి భారత్ లో సరికొత్త ఎస్‌యూవీని విడుదల చేసింది. రూ.2.07 కోట్ల (ఎక్స్-షోరూమ్, ఇండియా) ధరతో ఇది భారతదేశంలో కంపెనీ విడుదల చేసిన ఐదవ బిఎస్ 6 కంప్లైంట్ మోడల్. ప్రస్తుతం ఆడి దేశంలో అత్యంత శక్తివంతమైన ఎస్‌యూవీ. ఆడి ఇండియా హెడ్ ​​బల్బీర్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ, "ఆడి ఆర్ఎస్ క్యూ 8 భారత్‌కు తీసుకురావడం మాకు చాలా ఆనందంగా ఉంది అని అన్నారు. ఆడి ఆర్ఎస్ క్యూ 8 కోసం షోస్టాపర్ 4.0-లీటర్ టిఎఫ్‌ఎస్‌ఐ ట్విన్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్, 48-వోల్ట్ ప్రధాన ఆన్‌బోర్డ్ ఎలక్ట్రికల్ సిస్టమ్‌తో పాటు తేలికపాటి-హైబ్రిడ్ సిస్టమ్ (ఎంహెచ్‌ఇవి) తో జత చేయబడింది. కారుకు 8 స్పీడ్ టిప్టానిక్ గేర్ బాక్స్ ను అమర్చారు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 3.8 సెకన్లలో అందుకుంటుంది. అత్యధికంగా గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇంకా దీనిలో ఆర్ఎస్ డైనమిక్ ప్యాకేజీ వెర్షన్ ఏకంగా గంటకు 305 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఆడి ఆర్ఎస్8లో సిలిండర్ ఆన్ డిమాండ్ ఫీచర్ కలిగి ఉంది.

Tags

Next Story