2023 Elections : మోగిన ఎన్నికల నగారా..!

2023 Elections : మోగిన ఎన్నికల నగారా..!
త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ లో ఎన్నికల తేదీ ప్రకటన..



త్రిపుర, నాగాలాండ్, మేఘాలయలో ఎన్నికల నగారా మోగింది. త్రిపురలో ఫిబ్రవరి 16న, నాగాలాండ్, మెఘాలయలో ఫిబ్రవరి 27న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. ఫలితాలు మార్చి 2న ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు.

త్రిపుర ఎన్నికల వివరాలు :

త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 16న జరుగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఓట్ల లెక్కింపు మార్చి 2న జరుగనుంది. త్రిపురలో 60 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3,328 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. జనవరి 21న నోటిఫికేషన్ విడుదల అవుతుందని తెలిపారు. నామినేషన్ దాఖలు చేయడానికి జనవరి 20ని చివరి తేదీగా నిర్ణయించారు. ఫిబ్రవరి 2 వరకు నామినేషన్ల ఉపసంహరణకు చేసుకోవచ్చని తెలిపారు. ఎన్నికలు ఫిబ్రవరి 16న జరుగగా ఫలితాలు మార్చి 2న వెలువడనున్నాయి.

నాగాలాండ్ ఎన్నికల వివరాలు :

నాగాలాండ్ లో ఓకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 27న పోలింగ్, మార్చి 2న ఓట్ల లెక్కింపు జరుగనుంది. జనవరి 31న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. నామినేషన్ చివరి తేదీ ఫిబ్రవరి 7 కాగా ఉపసంహరణ ఫిబ్రవరి 10 గా నిర్ణయించారు.

నాగాలాండ్ లో 60 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుతం NDPP-BJP కూటమి అధికారంలో ఉంది. 2018 ఎన్నికల్లో NPFP 26, NDPP 18, BJP 12, NPP 2, JDU 1, Indipendent 1 సీట్లు వచ్చాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఎన్డీపీపీ కలిసి పోటీచేయనున్నట్లు తెలుస్తోంది.

మేఘాలయ ఎన్నికల వివరాలు :

మేఘాలయలో అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 27న జరుగనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఓట్ల లెక్కింపు మార్చి 2న వెలువడనుంది. మేఘాలయలో 3,482 పోలీంగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మేఘాలయ శాసనసభ పదవీకాలం మార్చి 15, 2023తో ముగియనుంది.

జనవరి 31న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. నామినేషన్ చివరి తేదీ ఫిబ్రవరి 7 కాగా ఉపసంహరణ ఫిబ్రవరి 10 గా నిర్ణయించారు.

Tags

Read MoreRead Less
Next Story