Gujarath: కల్తీ మద్యం తాగి 21 మంది మృతి.. మరికొంత మంది పరిస్థితి విషమం

Gujarath: కల్తీ మద్యం తాగి 21 మంది మృతి.. మరికొంత మంది పరిస్థితి విషమం
Gujarath: మద్యం మనుషుల జీవితాలను, కుటుంబాలను కూడా నాశనం చేస్తుంది. అయినా ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం వచ్చే మార్గం అదే కావడంతో మద్యం అమ్మకాలపై నియంత్రణ లేకుండా పోతోంది.

Gujarath: మద్యం మనుషుల జీవితాలను, కుటుంబాలను కూడా నాశనం చేస్తుంది. అయినా ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం వచ్చే మార్గం అదే కావడంతో మద్యం అమ్మకాలపై నియంత్రణ లేకుండా పోతోంది. ఖరీదైన బ్రాండ్లు కొనలేని వారు కల్తీ బ్రాండ్ మద్యం సేవించి అనారోగ్యం పాలవుతున్నవారు కొందరైతే మరికొందరు ప్రాణాలు కూడా కోల్పోతుంటారు.

తాజాగా చోటు చేసుకున్న ఘటనలో కల్తీ మద్యం సేవించి 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మరి కొంతమంది ఆస్పత్రి పాలయ్యారు. చికిత్స పొందుతున్న వారి పరిస్థితీ విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన గుజరాత్‌లో చోటు చేసుకుంది. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS), అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ రంగంలోకి దిగి విచారణ ప్రారంభించాయి. బోటాడ్ జిల్లాలో 16 మంది, ధందుక, భావ్ నగర్‌లో ఐదుగురు మృతి చెందారు. మరికొంతమంది వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారని అధికారులు పేర్కొన్నారు.

కాగా, కల్తీ మద్యం తయారు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనపై ప్రభుత్వం విచారణ ఏర్పాటు చేసింది. గుజరాత్ టెర్రరిజం స్క్వాడ్, అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ సైతం దర్యాప్తులో చేరాయని బొటాడ్ పోలీస్ సూపరింటెండెంట్ కరణరాజ్ వాఘేలా తెలిపారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తులు నకిలీ మద్యాన్ని తయారు చేసి విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. మృతుల్లో ఎక్కువ మంది కూలీలు ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story