IndiGo: అస్సలు ఆగలేకపోయింది.. టాయిలెట్‌లోకి వెళ్లి మరీ..

IndiGo: అస్సలు ఆగలేకపోయింది.. టాయిలెట్‌లోకి వెళ్లి మరీ..
IndiGo: అలవాటు మరి.. అస్సలు ఆపుకోలేకపోయింది. టాయిలెట్‌లోకి వెళ్లి మరీ దమ్ముకొట్టింది. పట్టుబడింది.

IndiGo: అలవాటు మరి.. అస్సలు ఆపుకోలేకపోయింది. టాయిలెట్‌లోకి వెళ్లి మరీ దమ్ముకొట్టింది, పట్టుబడింది. కోల్‌కతా నుంచి వచ్చిన ఇండిగో విమానంలోని టాయిలెట్‌లో ధూమపానం చేస్తూ పట్టుబడిన 24 ఏళ్ల మహిళను బెంగళూరు రాగానే పోలీసులు అరెస్టు చేశారు. ప్రియాంక ఫ్లైట్ ప్రయాణం మధ్యలో పొగ తాగుతున్నట్లు అనుమానించిన క్యాబిన్ సిబ్బంది ఆమెను టాయిలెట్ డోర్ తెరవమని అడిగారు. దాంతో తత్తరపాటుకు గురైన ప్రియాంక కాలుస్తున్న సిగరెట్‌ను డస్ట్‌బిన్‌లో పడేసి పొగరాకుండా నీళ్లు చల్లింది. కోల్‌కతా-బెంగళూరు మధ్య ప్రయాణం దాదాపు రెండున్నర గంటలు ఉంటుంది. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన తర్వాత, ప్రయాణీకురాలిని భద్రతా అధికారులకు అప్పగించారు విమాన సిబ్బంది. తరువాత ఆమెను విమానాశ్రయ పోలీసులు అరెస్ట్ చేశారు.

భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 336 కింద ఇతరుల వ్యక్తిగత భద్రతకు హాని కలిగించినందుకు ప్రియాంకపై కేసు నమోదు చేయబడింది. IPC సెక్షన్ 336 ప్రకారం మూడు నెలల వరకు జైలు శిక్ష లేదా రూ. 250 జరిమానా లేదా రెండూ విధిస్తారు. ఆ తర్వాత ప్రియాంక బెయిల్‌పై విడుదలైంది. చాలా దేశాల్లో గత కొన్ని సంవత్సరాలుగా విమానాలలో ధూమపానం పూర్తిగా నిషేధించబడింది. విమానాలలో పొగతాగడం వల్ల అగ్ని ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే ధూమపానం నిషేధించబడింది. ఇది ప్రయాణికులు మరియు సిబ్బంది అందరి జీవితాలకు ముప్పును కలిగిస్తుంది. విమానయాన సంస్థలు, ప్రయాణీకులు నిబంధనలను పాటించడం చాలా ముఖ్యం.

Tags

Read MoreRead Less
Next Story