గుజరాత్‌లో భవనం కుప్పకూలి ముగ్గురు మృతి

గుజరాత్‌లో భవనం కుప్పకూలి ముగ్గురు మృతి
గుజరాత్‌లో సోమవారం రాత్రి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.

గుజరాత్‌లో సోమవారం రాత్రి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.వడోదర నగరంలో బావామాన్ పురా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం కుప్పకూలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా.. పలువురికీ తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు సమాచారం మేరకు అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేసుకున్న పోలీసులు.. నాణ్యతలోపం వలనే భవనం కూలిపోయిందని చెబుతున్నారు.

Tags

Next Story