ఆక్సిజన్ అందక ఆస్పత్రిలో ముగ్గురు రోగులు మృతి

By - shanmukha |22 Sept 2020 5:20 PM IST
తమిళనాడులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రిలో ముగ్గురు రోగులు ఆక్సిజన్ అందక చనిపోయారు.
తమిళనాడులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రిలో ముగ్గురు రోగులు ఆక్సిజన్ అందక చనిపోయారు. తిరుపూర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఈ దారుణం జరిగిందని అధికారులు చెబుతున్నారు. దీంతో మృతుల కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకొని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com