పవన్ జన్మదిన వేడుకల్లో విషాదం.. ముగ్గురు మృతి

X
చిత్తూరు జిల్లాలో పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ప్లెక్సీలు కడుతుండగా విద్యుత్ షాక్ తగిలి ముగ్గురు పవన్ అభిమానులు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఇద్దరు అన్నదమ్ములేనని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని విచారణ చేపట్టారు. మృతులు సోమశేఖర్, రాజేంద్ర, అరుణాచలంగా గుర్తించారు. దీంతో పవన్ అభిమానుల్లో, చిత్తూరు జిల్లా శాంతిపురంలో విషాదం నెలకొంది. అయితే, ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. అభిమానులు మృతి తనను కలచి వేసిందని అన్నారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల చెప్పున ఆర్థిక సాయం చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
