ఆ రైతు అయిదుగురు కుమార్తెలు ఆర్ఏఎస్ అధికారులు..!

రాజస్థాన్‌లోని హనుమన్‌గర్‌కు చెందిన ముగ్గురు సోదరీమణులు అన్షు, రీతు మరియు సుమన్ రాజస్థాన్ పబ్లిక్ అడ్మినిస్టనేటివ్ పరీక్షల్లో విజయం సాధిచారు. మరో ఇద్దరు సోదరీమణులు రోమా మరియు మంజులతో కలిసి ఇప్పటికే అధికారులుగా ఉన్నారు.
రైతు సహదేవ్ సహారన్‌కు అయిదుగురు ఆడపిల్లలే పుట్టారని బంధువులు బాధపడేవారు. కానీ సహదేవ్ కానీ అతడి భార్య కానీ ఎప్పుడూ బాధపడే వారు కాదు. అమ్మాయిలైతేనేమి అన్ని రంగాల్లో ముందుకు పోతున్నారు. నా కుమార్తెలను బాగా చదివించి గొప్ప వారిని చేస్తానని అనాడే కంకణం కట్టుకున్నారు. మధ్య తరగతి కుటుంబమైనా మంచి స్కూల్లో చేర్పించారు. వారి చదువులకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూసుకున్నారు. చదువే మీకు సమాజంలో గుర్తింపు తీసుకు వస్తుందని పిల్లలకు పదే పదే చెబుతుండేవారు.
నాన్న చెప్పిన మాటలు, నాన్న ఆశయాలు నెరవేర్చాలనుకున్నారు. నాన్న కష్టం వృధా పోనివ్వకూడదనుకున్నారు. అమ్మకి సాయంగా ఉంటూనే ప్రతి తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. కుమార్తెలు ఐదుగురూ సరస్వతీ పుత్రికలు. చదువుల మహరాణులు. రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (RAS) అధికారులుగా నియమితులై అందరి ప్రశంసలందుకుంటున్నారు. ఈ వార్తను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి పర్వీన్ కస్వాన్ ట్విట్టర్‌లో పంచుకున్నారు.
"ఇది చాలా సంతోషకరమైన విషయం. అన్షు, రీతు మరియు సుమన్ రాజస్థాన్ లోని హనుమన్‌గర్‌కు చెందిన ముగ్గురు సోదరీమణులు. ఈ రోజు ముగ్గురూ కలిసి RAS లో ఎంపికయ్యారు. తండ్రి మరియు కుటుంబాన్ని గర్వించేలా చేస్తున్నారు. వ్యవసాయ పనులు చేసుకునే రైతు సహరన్‌కి ఐదుగురు సోదరీమణులు. పెద్దవాళ్లైన ఇద్దరు రోమా మరియు మంజులు అప్పటికే RAS. మొత్తం ఐదుగురు రైతు శ్రీ సహదేవ్ సహారన్ కుమార్తెలు ఇప్పుడు RAS అధికారులు "అని కస్వాన్ ట్వీట్ చేశారు. రాస్ 2018 యొక్క రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఆర్‌పిఎస్‌సి) తుది ఫలితం మంగళవారం ప్రకటించింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ట్వీట్ ద్వారా టాపర్స్ ను అభినందించారు.
రాస్ పరీక్షలో అగ్రస్థానంలో నిలిచిన అందరికీ అభినందనలు. అంకితభావంతో రాష్ట్రానికి సేవ చేయడానికి ఇది వారికి లభించిన ఒక గొప్ప అవకాశం. వారికి నా శుభాకాంక్షలు "అని గెహ్లాట్ ట్వీట్ చేశారు. ఫలితాలను ఆర్‌పిఎస్‌సి అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించారు.
Such a good news. Anshu, Reetu and Suman are three sisters from Hanumangarh, Rajasthan. Today all three got selected in RAS together. Making father & family proud. pic.twitter.com/n9XldKizy9
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) July 14, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com