Rajasthan : అల్వార్‌లో 300 ఏళ్ల నాటి మూడు ఆలయాలు కూల్చివేత

Rajasthan :  అల్వార్‌లో 300 ఏళ్ల నాటి మూడు ఆలయాలు కూల్చివేత
Rajasthan : దేశంలో ఇప్పుడు బుల్డోజర్ ట్రెండ్ నడుస్తోంది. అక్రణ నిర్మాణాలపై బీజేపీ బుల్డోజర్‌లను ఎక్కుపెడుతోంది.

Rajasthan : దేశంలో ఇప్పుడు బుల్డోజర్ ట్రెండ్ నడుస్తోంది. అక్రణ నిర్మాణాలపై బీజేపీ బుల్డోజర్‌లను ఎక్కుపెడుతోంది. మొదట ఉత్తరప్రదేశ్‌లో మొదలైన బుల్డోజర్ సంస్కృతి ఇతర రాష్ట్రాలకు వ్యాపిస్తోంది. ఇటీవల మధ్యప్రదేశ్‌ సహా ఢిల్లీ జహంగీర్‌పురిలో అక్రమనిర్మాణాల కూల్చివేతలు వివాదాస్పంగా మారాయి. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు చేరింది.

ఇప్పుడు రాజస్థాన్‌ అల్వార్‌లో వందల ఏళ్ల నాటి 3 ఆలయాలను కూల్చివేయడం వివాదానికి దారి తీసింది. సరాయి మొహల్లా ప్రాంతంలో 300 ఏళ్ల నాటి పురాతన శివాలయం సహా మరో రెండు ఆలయాలను బుల్డోజర్ల సాయంతో కూల్చివేశారు అధికారులు. మరికొన్ని దుకాణాలు, నిర్మాణాలను సైతం ధ్వంసం చేశారు. ఈ కూల్చివేతలపై హిందూ సంఘాలు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి రాజ్‌గఢ్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

ఆలయ కూల్చివేతలపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. నిజానిజాలను వెలికితీసేందుకు ఐదుగురు సభ్యులతో కమిటీని నియమిస్తున్నట్లు తెలిపారు రాజస్థాన్ బీజేపీ చీఫ్ సతీశ్ పునియా. ఘటనా స్థలాన్ని పరిశీలించి వాస్తవాలతో కూడిన నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించారు. సిటీ అభివృద్ధి పనుల మాస్టర్ ప్లాన్‌లో భాగంగా కూల్చివేతలు జరిగినట్లు సమాచారం. ఐతే అధికార కాంగ్రెస్‌ బీజేపీపై ప్రతి విమర్శలు చేసింది.

స్థానిక రాజ్‌ఘర్ మున్సిపాలిటీ బీజేపీ చేతుల్లోనే ఉందని...ఆక్రమణలు తొలగించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని మున్సిపాలిటీనే గతేడాది సెప్టంబర్‌లోతీర్మానం చేసిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. రాజ్‌ఘర్‌ మున్సిపాలిటీలో 35 మంది సభ్యులుంటే 34 మంది బీజేపీ మెంబర్స్ ఉన్నారని చెప్తోంది. కూల్చివేతలతో రాష్ట్రప్రభుత్వానికి సంబంధం లేదని చెప్తోంది.

Tags

Read MoreRead Less
Next Story