All Party Meeting: ఆల్ పార్టీ సమావేశానికి హాజరైన 31 పార్టీలు.. పలు కీలక అంశాలపై చర్చ..

All Party Meeting (tv5news.in)
All Party Meeting: పార్లమెంట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అపోజిషన్ పార్టీలు సిద్ధమవగా..ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధమని కేంద్రం ప్రకటించింది. ఆల్ పార్టీ మీటింగ్‌లో రైతు సమస్యలు, ద్రవ్యోల్బణం, పెట్రో ధరల పెంపు అంశాన్ని విపక్షాలు లేవనెత్తాయి. ఏపీ ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించేలా చూడాలని కేంద్రాన్ని కోరింది టీడీపీ. తెలంగాణలో ధాన్యం పూర్తిగా కేంద్రం కొనాలని డిమాండ్ చేశారు టీఆర్ఎస్ ఎంపీలు.
వాయిస్: పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఢిల్లీలో ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. సమావేశానికి 31 పార్టీలు హాజరయ్యాయి. సమావేశంలో నిర్మాణాత్మక చర్చ జరిగిందన్నారు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి. స్పీకర్,ఛైర్మన్ అనుమతించిన ఏ అంశంపైనైనా అంతరాయం లేకుండా చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు.
వాయిస్: ఏపీలో రాజధాని అంశంపై నెలకొన్న అనిశ్చితిని తొలగించి.. అమరావతియే రాజధానిగా కొనసాగేలా చూడాలని కేంద్రాన్ని కోరినట్లు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ తెలిపారు. అటు పెట్రోల్, డీజిల్ పై కేంద్రం సుంకం తగ్గించినా.. ఏపీలో పెట్రోల్ ధరలు ఏమాత్రం తగ్గించలేదన్న విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించొద్దని.. గనులను కేటాయించి ప్రభుత్వమే నడపాలని కోరామన్నారు.
ఈ సమావేశాల్లో 37 బిల్లులు ప్రవేశపెట్టాలని కేంద్రం ప్రతిపాదించిందన్నారు టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు. గతంలో మాదిరిగా చర్చ లేకుండా బిల్లులు ఆమోదించవద్దని కోరినట్లు చెప్పారు. తెలంగాణలో మొత్తం పంట కొనాలని డిమాండ్ చేశారు. ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. అఖిలపక్ష సమావేశానికి ప్రధాని మోడీ హాజరుకాకపోవడం అసంతృప్తి వ్యక్తం చేసింది కాంగ్రెస్ పార్టీ.
వ్యవసాయ చట్టాలు కేంద్రం వెనక్కి తీసుకుంటామని చెప్పిందన్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ మల్లిఖార్జున్ ఖర్గే. ఐతే రైతులు వాటిని అర్థం చేసుకోలేదనడం చూస్తుంటే భవిష్యత్‌లో మళ్లీ అగ్రిచట్టాలు తెచ్చే అవకాశం ఉందన్నారు. కరోనా కారణంగా చనిపోయిన వారితో పాటు, ఢిల్లీలో రైతు ఆందోళనల్లో చనిపోయిన వారి కుటుంబాలకు 4 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు చెప్పారు ఖర్గే.
ద్రవ్యోల్బణం, ఇంధన ధరల పెంపు, రైతులు సహా అనేక అంశాలు సమావేశంలో చర్చించామన్నారు. కనీస మద్ధతు ధరకు చట్టబద్ధత కల్పించాలని అన్ని పార్టీలు డిమాండ్ చేశాయన్నారు. ఆల్‌పార్టీ మీటింగ్‌లో విపక్ష నేతలకు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్. ఈ సమావేశాల్లోనే MSPకి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేసినట్లు చెప్పారు. BSF పరిధి పెంపు అంశం కూడా చర్చకు వచ్చిందన్నారు.
మరోవైపు పార్లమెంట్‌లో మీడియాపై ఆంక్షల అంశంపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదురి. మీడియాపై ఆంక్షలు సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగో స్తంభంగా ఉందన్నారు. కరోనా కారణంగా గతేడాది మీడియాను అనుమతించలేదని..ఇప్పుడు హోటల్స్,రెస్టారెంట్లు అన్ని చోట్ల నిబంధనలు తొలగించారని గుర్తు చేశారు. కానీ పార్లమెంట్‌లో మాత్రం ఆంక్షలు ఎందుకని ప్రశ్నించారు. తక్షణమే ఆంక్షలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com