కేరళలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 215 మంది మృతి
కేరళలో కరోనా కేసులు మళ్లీ రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 31 వేలకు పైగా పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి. కరోనా బారిన పడి 215 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో 31,445 కేసులు నమోదైనట్లు కేరళ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 38,83,429కి చేరింది. మృతుల సంఖ్య 19,972కి పెరిగింది. ఎర్నాకులం జిల్లాలో అత్యధికంగా 4,048 కేసులు వచ్చాయి. త్రిస్సూర్, కోళికోడ్, మలప్పురం జిల్లాల్లో మూడు వేలకు పైగా కేసులు వెలుగుచూసినట్లు కేరళ సర్కార్ వెల్లడించింది. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు సైతం 19.03గా నమోదైంది. ఇటీవల జరిగిన ఓనమ్ పండుగే దీనికి కారణమని తెలుస్తోంది.
కేరళలో ఆగస్టు 21న ఓనమ్ పండగ జరిగింది. దాంతో కేసులు పెరుగుతాయని ప్రభుత్వం ముందుగానే అంచనా వేసింది. మరో వారం రోజులు అప్రమత్తంగా ఉండాలని ఆ మేరకు ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ అధికారులకు సూచించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com