ఒకే కుటుంబానికి చెందిన 32 మందికి కోవిడ్

ఒకే కుటుంబానికి చెందిన 32 మందికి కోవిడ్
దేశంలో వైరస్ రికవరీ కేసులు పెరగడం మంచి పరిణామమే ..

దేశంలో వైరస్ రికవరీ కేసులు పెరగడం మంచి పరిణామమే అయినా, అదే స్థాయిలో పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతుండడం అధికారులను కలవరానికి గురిచేస్తోంది. గత కొద్ది రోజులుగా రోజుకు 70వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా యూపీలోని బాందాలో ఒకే కుటుంబానికి చెందిన 32 మందికి పాజిటివ్ నిర్ధారణ కావడం వైరస్ తీవ్రతకు అద్ధం పడుతోంది. బాందా పట్టణంలో సోమవారం సాయింత్రం 44 కొత్త కేసులు రాగా.. వీరిలో 32 మంది పుతాకౌన్ ప్రాంతంలో నివసించే ఒకే కుటుంబానికి చెందిన వారని వైద్య అధికారి శర్మ వెల్లడించారు. బాందా జిల్లాలో ఇప్పటివరకు 807 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఎనిమిది మంది మరణించారు. మొత్తం బాధితుల్లో 439 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మరో 360 మంది వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. కాగా రాష్ట్రంలో రికవరీ రేటు 75 శాతం ఉండగా.. మరణాల రేటు 1.5శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

Tags

Next Story